Eam Sandeham Ledhu Song Lyrics
SONG NAME : EAM SANDEHAM LEDHU
LYRICS WRITER : ANANTH SRIRAM
SINGERS : KALYANI KODURU, SUNITHA
ఏమ్ సందేహం లేదు
ఆ అందాల నవ్వే
ఈ సందళ్ళు తెచ్చింది
ఏమ్ సందేహం లేదు
ఆ కందేటి సిగ్గే
ఈ తొందర్లు ఇచ్చింది
ఏమ్ సందేహం లేదు
ఆ గంధాల గొంతు
ఆనందాలు పెంచింది
నిమిషము నేలమీద
నిలవని కలిలాగ
మది నిను చేరుతోంది చిలకా
తనకొక తోడులాగ
వెనకనే సాగుతుంది
హృదయము రాసుకున్న లేఖ
ఏమ్ సందేహం లేదు
ఆ అందాల నవ్వే
ఈ సందళ్ళు తెచ్చింది
ఏమ్ సందేహం లేదు
ఆ కందేటి సిగ్గే
ఈ తొందర్లు ఇచ్చింది
వెన్నెల్లో ఉన్నా వెచ్చంగా ఉంది
నిన్నే ఊహిస్తుంటే
ఎందర్లో ఉన్న ఏదోలా ఉంది
నువ్వే గుర్తొస్తుంటే
నా కళ్ళల్లోకి వచ్చి నీ కల్లాపే చల్లి
ఓ ముగ్గేసి వెళ్ళావే
నిదరిక రాదు అన్న నిజమును మోసుకుంటు
మది నిను చేరుతుంది చిలకా
తనకొక తోడులాగ
వెనకనే సాగుతుంది
హృదయము రాసుకున్న లేఖా
వెన్నెల్లో ఉన్నా వెచ్చంగా ఉంది
నిన్నే ఊహిస్తుంటే
ఎందర్లో ఉన్న ఏదోలా ఉంది
నువ్వే గుర్తొస్తుంటే
నీ కొమ్మల్లో గువ్వ ఆ గుమ్మంలోకెళ్ళి
కూఁ అంటుంది విన్నావా
నీ మబ్బుల్లో జల్లు ఆ ముంగిట్లో పూలు
పూయిస్తే చాలన్నవా
ఏమ్ముతున్నగాని ఏమైనా అయిపోని
ఏఁ పర్వాలేదన్నవా
అడుగులు వెయ్యలేక అటు ఇటు తేల్చుకోలేక
సతమతమైన గుండె గనుకా
అడిగిన దానికింకా బదులిక పంపుతుంది
పదములు లేని మౌన లేఖా
*****
Comments
Post a Comment