Panchadara Bomma Bomma Song Lyrics
MOVIE : MAGADHEERA
MUSIC : KEERAVANI
DIRECTOR : RAJAMOULI SS
YEAR : 2009
పంచదార బొమ్మ బొమ్మ పట్టుకోవద్దనకమ్మా
మంచు పూల కొమ్మ కొమ్మా ముట్టుకో వద్దనకమ్మా
చేతినే తాకొద్దంటే చెంతకే రావద్దంటే ఏమవుతానమ్మ్మ
నిన్ను పొందేటందుకు పుట్టనే గుమ్మ
నువ్వు అందకపోతే వృధా ఈ జన్మ
నిన్ను పొందేటందుకు పుట్టనే గుమ్మ
నువ్వు అందకపోతే వృధా ఈ జన్మ ఆఁ ఆఁ ఆఁ
పువ్వుపైన చేయిస్తే కసిరి నన్ను తిట్టింది
పసిడి పువ్వు నువ్వని పంపిందే
నువ్వు రాక నా వెంటా భూమి చుట్టు ముళ్లంటా
అంటుకుంటే మండే వాళ్లంతా
తీగపైన చెయ్యేస్తే తిట్టి నన్ను నెట్టిందే
మెరుపుతీగ నువ్వని పంపిందే
మెరుపు వెంట ఉరుమంటా ఉరుమువెంట వరదంటా
నీ వరదలాగ మారెను ముప్పంటా
వరధైనా వరమని బరిస్తానమ్మా
మునకైనా సుఖమని ముడేస్తానమ్మా
నిన్ను పొందేటందుకు పుట్టనే గుమ్మ
నువ్వు అందకపోతే వృధా ఈ జన్మ ఆఁ ఆఁ ఆఁ
గాలి నిన్ను తాకింది నేల నిన్ను తాకింది
నేను నిన్ను తాకితే తప్పా
గాలి ఊపిరయ్యింది నేల నన్ను నడిపింది
ఏమిటంటా నీలోని గొప్పా
వెలుగు నిన్ను తాకింది చినుకు కూడ తాకింది
పక్షపాతము ఎందుకు నా పైనా
వెలుగు దారి చూపింది చినుకులారపోసింది
వాటితోటి పోలిక నీకేలా
అవి బ్రతికున్నప్పుడు తోడుంటాయమ్మా
నీ చితిలో తోడై నేనొస్తానమ్మా
నిన్ను పొందేటందుకు పుట్టనే గుమ్మ
నువ్వు అందకపోతే వృధా ఈ జన్మ ఆఁ ఆఁ ఆఁ
*****
Comments
Post a Comment