Pranamam Pranamam Song Lyrics
Music : Devi Sri Prasad
Singers : Shankar Mahadevan
Lyrics : Ramajogayyasastry
ప్రణామం ప్రణామం ప్రణామం
ప్రభాత సూర్యుడికి ప్రణామం
ప్రణామం ప్రణామం ప్రణామం
సమస్త ప్రకృతికి ప్రణామం
ప్రమోదం ప్రమోదం ప్రమోదం
ప్రతి సృష్టి ప్రమోదం
ప్రయాణo ప్రయాణం ప్రయాణం
విశ్వంతో మమేకం ప్రయాణం
మన చిరు నవ్వులే పూలు
నిట్టూర్పులే తడి మేఘాలు
హృదయమే గగనం
రుధిరమే సంద్రం
ఆశే పచ్చదనం
మారె ఋతువుల వర్ణం
మన మనసుల భావోద్వేగం
సరిగా చూస్తే ప్రకృతి మొత్తం
మనలో ప్రతిబింబం
నువ్వెంత నేనెంత రవ్వంత
ఎన్నో ఏళ్ళది సృష్టి చరిత్ర
అనుభవమే దాచింది కొండంతా
తన అడుగులో అడుగేసి
వెళదాం జనమంతా
ప్రణామం ప్రణామం ప్రణామం
ప్రభాత సూర్యుడికి ప్రణామం
ప్రణామం ప్రణామం ప్రణామం
సమస్త ప్రకృతికి ప్రణామం
ఎవడికి సొంతమైనదంతా
ఇది ఎవ్వడు నాటిన పంట
ఎవడికి వాడే నాడే హక్కని
చెయ్యేస్తే ఎట్టా
తరముల నాటి కదంతా
మన తదుపరి మిగలాలంతా
ప్రేమించే పెద్దమ్మే ఈ విశ్వం
ఇష్టంగా గుండెకు హత్తుకుందాం
కన్నీరై కన్నీరై ఓ కొంచెం
తల్లడిల్లిందో ఈ తల్లి
ప్రణామం ప్రణామం ప్రణామం
ప్రభాత సూర్యుడికి ప్రణామం
ప్రణామం ప్రణామం ప్రణామం
సమస్త ప్రకృతికి ప్రణామం
*****
Comments
Post a Comment