Eavre Eavare Song Lyrics
...
MOVIE : PREMAM
MUSIC : RAJESH MURUGESAN
SINGERS : VIJAY YESUDAS
LYRICS : SHREE MANI
తెల్లవారితే కనురెప్పలా తొలి మేకువ నువ్వే
నా గుప్పెడు గుండెల్లో చిరు చప్పుడు నువ్వే
పొలమారితే నీ మనసుకి అది నా పొరపాటే
నీపేరే పలకడమే పెదవులకలవాటే
వెన్నెలలా ఉంటుందే నీ పక్కన చోటే
వేకువలా చూస్తుందే నువ్వు నడిచిన బాటే
ప్రాణాలే తీస్తుందే నీ ఊహల తోటే
నా మనసే నీదయ్యీ వినదే నా మాటే
ఎవరే ఎవరే ప్రేమను మాయంది
ఎవరే ఈ హాయికి హృదయము చాలంది
ఎవరే నిన్నే నావైపు నడిపే
నా ఊహల మధురోహల హరివిల్లు నింపే
తియ తియ్యని నిమిషాలే నీలోన ఒంపే
నా ఒంటరి కాలాన్నే నీతోనే చెరిపే
ఆ ధైవమే నాకు చెప్పింది ఎపుడో
నీ చిన్ని చిరునవ్వే విలువైన వరమంటూ
నా ప్రాణమే నీకు చెపుతుంది ఇపుడు
నువ్వు లేక నేలేనని
గది లాంటి మదిలో నది లాంటి నిన్నే
దాచేయాలనుకుంటే అది నా అత్యాసే
అడుగంత దూరం నువ్వు దూరమైన
నా ఊపిరి చిరునామ తెలిపేదెవరే
ఎవరే ..... ఎవరే.....
వెన్నెలలా ఉంటుంది నీ పక్కన చోటే
వేకువలా చూస్తుందే నువ్వు నడిచిన బాటే
ప్రాణాలే తీస్తుంది నీ ఊహల తోటే
నా మనసే నీదయ్యీ వినదే నా మాటే
ఎవరే ఎవరే ప్రేమను మాయంది
ఎవరే ఈ హాయికి హృదయము చాలంది
*****
Comments
Post a Comment