Pacha Bottesina Song Lyrics
సింగర్స్ : కార్తీక్ , దామిని
Lyrics Writer : అనంత శ్రీరామ్
మ్యూజిక్ డైరెక్టర్ : M.M.కీరవాణి
పచ్చా బొట్టేసినా పిల్లగాడా నిన్ను
పచ్చి ప్రాయాలనే పంచుకుంటానురా
జంట కట్టేసిన తుంటరోడానితో
కొంటె తంటాలనే తెచ్చుకొంటా దొరా
వెయ్యి జన్మాల ఆరాటమై
వేచి ఉన్నానే నీ ముందరా
చేయి నీ చేతిలో చేరగా
రెక్క విప్పిందే నా తొందరా
పచ్చా బొట్టేసినా పిల్లగాడా నిన్ను
పచ్చి ప్రాయాలనే పంచుకుంటానురా
మాయగా నీ సోయగాలలు వేసి
నన్నిలా లాగింది నువ్వే అలా
కబురులతో కాలాన్నే కరిగించే వ్రతమేలా
హత్తుకుపో నను ఊపిరి ఆగేలా
బాహు బంధాల పొత్తిళ్ళలో
విచ్చుకున్నావే ఓ మల్లికా
కోడి కౌగిళ్ళ పొత్తిళ్ళలో
కురి విప్పిందే న కోరికా
పచ్చా బొట్టేసినా పిల్లగాడా నిన్ను
పచ్చి ప్రాయాలనే పంచుకుంటానురా
కానలో నువ్వు నేను ఒక మేను కాగా
కొనలో ప్రతి కొమ్మ మురిసేనుగా
మరుక్షణమే ఎదురైనా
మరణము కూడా పరవశమే
శాంతం నేను నీ సొంతం అయ్యాక
చెమ్మ చేరేటి చెక్కిళ్ళలో
చిందులేసింది సిరివెన్నెలా
ప్రేమ ఊరేటి నీ కలలో
రేయి కదిలింది తేలి మంచులా
పచ్చా బొట్టేసినా పిల్లగాడా నిన్ను
పచ్చి ప్రాయాలనే పంచుకుంటానురా
జంట కట్టేసిన తుంటరోడానితో
కొంటె తంటాలనే తెచ్చుకొంటా దొరా
*****
Comments
Post a Comment