Jatha kalise Jatha kalise Song Lyrics
MOVIE : SRIMANTHUDU
SONG : JATHA KALISE
SINGERS : SAGAR , SUCHITRA .
LYRICS : RAMAJOGAYYA SASTHRI
జతకలిసే జతకలిసే జగములు రెండు జతకలిసే
జతకలిసే జతకలిసే అడుగులు రెండు జతకలిసే
జనమొకతీరు వీళ్ళదోకతీరు ఇద్దరొకలాంటి వారు
అచ్చుగుద్దినట్టు ఒక కలగంటూ ఉన్నారిద్దరు
ఏ కన్నూ ఎప్పుడూ చదవని పుస్తకమై వీరూ
చదివేస్తున్నారానందంగా వకరిని ఇంకొకరూ
నలుపుజాడ నలుసైనా అంటుకోని హృదయాలు
తలపులతోనా ఆడ మగలని గుర్తులేని పసివాళ్లు
మాట్లాడుకోకున్న మది తెలుపుకున్న బావాలు
ఒకరికొకరు ఎదురువుంటే చాలులే నాట్యమాడు ప్రాయాలు
పేరుకేమో వీరు వీరు బొమ్మలేమరి
ఇరువురికి గుండెలోని ప్రాణం ఒకటేకదా
బహుశా బ్రహ్మ పొరపాటులోన
ఒక్కరే ఇద్దరు అయ్యారు
ఏ కన్నూ ఎప్పుడూ చదవని పుస్తకమై వీరూ
చదివేస్తున్నారానందంగా వకరిని ఇంకొకరూ
ఉన్నచోటు వదిలేసి ఎగిరిపోయను ఈ లోకం
ఏకమైన ఈ జంట కొరకు ఏకాంతం ఇవ్వటం కోసం
నీలి రంగు తెర తీసి తొంగిచూసే ఆకాశం
చూడకుండ ఈ అద్భుతాన్ని అసలు ఉండలేదు ఒక నిమిషం
నిన్నదాక ఇందుకేమో వేచి ఉన్నది
ఎద తెగని సంబరానా తేలినాను నేను ఇలా
ఇప్పుడే కలిసి అప్పుడే వీరు
ఎప్పుడో కలిసిన వారయ్యారు
ఏ కన్నూ ఎప్పుడూ చదవని పుస్తకమై వీరూ
చదివేస్తున్నారానందంగా వకరిని ఇంకొకరూ
*****
Comments
Post a Comment