Edo Priya Ragam Vintunna Song Lyrics
...
ప్రేమ ఆ సందడి నీదేనా
ఎదో నవనాట్యం చూస్తున్నా సిరిమువ్వల్లో
ప్రేమ ఆ సందడి నీదేనా
ఇట్టాగే కలకాలం చూడాలనుకుంటున్నా
ఇటుపైన ఈ స్వప్నం కరిగించకు ఏమైనా
ప్రేమా ఓ ప్రేమా చిరకాలం నావెంటే
నువ్వుంటే నిజమేగా స్వప్నం
నువ్వుంటే ప్రతి మాట సత్యం
నువ్వుంటే మనసంత ఏదొ తీయని సంగీతం
నువ్వుంటే ప్రతి అడుగూ అందం
నువ్వుంటే ప్రతి క్షణమూ స్వర్గం
నువ్వుంటే ఇక జీవితమంతా ఏదో సంతోషం
పాట పాడదా మౌనం పురివిప్పి ఆడదా ప్రాణం
అడవినైన పూదోట చేయడ ప్రేమ బాటలొ పయనం
దారి చూపదా శూన్యం అరచేత వాలదా స్వర్గం
ఎల్లదాటి పరువాలు తొక్కదా వెల్లువైన ఆనందం
ప్రేమా నీ సావాసం నా శ్వాసకు సంగీతం
ప్రేమా నీ సానిద్యం నా ఊహల సామ్రాజ్యం
ప్రేమా ఓ ప్రేమా గుండెల్లో కలకాలం
నువ్వుంటే ప్రతి ఆశ సొంతం
నువ్వుంటే చిరుగాలే గంధం
నువ్వుంటే ఏనాడైనా కదా తీయని సాయంత్రం
నువ్వుంటే ప్రతి మాటా వేదం
నువ్వుంటే ప్రతి పలుకు రాగం
నువ్వుంటే చిరునవ్వులతోనే నిండెను ఈ లోకం
ఉన్నచోట ఉన్నానా ఆకాశమందుకున్నానా
చెలియలోని ఈ కొత్త సంబరం నాకు రెక్క తొడిగేనా
మునిగి తేలుతున్నానా ఈ ముచ్చటైన మురిపాన
ఆమెలోని ఆనంద సాగరం నన్ను ముంచే సమయాన
హరివిల్లు నావల్లే ఈ రంగులు నీ వల్లే
సిరిమల్లెల వాగొల్లె ఈ వెన్నెల నీ వల్లే
ప్రేమా ఓ ప్రేమ ఇది శాశ్వతమనుకోన
నువ్వుంటే దిగులంటూ రాదే
నువ్వుంటే వెలుగంటూ పొందే
నువ్వుంటే మరి మాటలుకూడా పాటై పోతాయే
నువ్వుంటే ఎదుర్లంటూ లేదే
నువ్వుంటే అలుపంటూ రాదే
నువ్వుంటే ఈ కష్టాలైనా ఎంతో ఇష్టాలే
*****
నువ్వుంటే ప్రతి ఆశ సొంతం
నువ్వుంటే చిరుగాలే గంధం
నువ్వుంటే ఏనాడైనా కదా తీయని సాయంత్రం
నువ్వుంటే ప్రతి మాటా వేదం
నువ్వుంటే ప్రతి పలుకు రాగం
నువ్వుంటే చిరునవ్వులతోనే నిండెను ఈ లోకం
ఉన్నచోట ఉన్నానా ఆకాశమందుకున్నానా
చెలియలోని ఈ కొత్త సంబరం నాకు రెక్క తొడిగేనా
మునిగి తేలుతున్నానా ఈ ముచ్చటైన మురిపాన
ఆమెలోని ఆనంద సాగరం నన్ను ముంచే సమయాన
హరివిల్లు నావల్లే ఈ రంగులు నీ వల్లే
సిరిమల్లెల వాగొల్లె ఈ వెన్నెల నీ వల్లే
ప్రేమా ఓ ప్రేమ ఇది శాశ్వతమనుకోన
నువ్వుంటే దిగులంటూ రాదే
నువ్వుంటే వెలుగంటూ పొందే
నువ్వుంటే మరి మాటలుకూడా పాటై పోతాయే
నువ్వుంటే ఎదుర్లంటూ లేదే
నువ్వుంటే అలుపంటూ రాదే
నువ్వుంటే ఈ కష్టాలైనా ఎంతో ఇష్టాలే
*****
Comments
Post a Comment